గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరిస్తా : సజ్జల రామకృష్ణారెడ్డి

 

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలపై రాష్ట్ర కమిటీ సమావేశం మంగళవారం ఎపి రెవెన్యూ జెఎసి చైర్మన్‌ వి.ఎస్‌.దివాకర్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు జి.ధైర్యం, ప్రధాన కార్యదర్శి సత్యరాజు అధ్యక్షతన పూజిత కన్వర్షన్‌ హాల్‌ విజయవాడలో రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఆయా జిల్లాల నుండి వచ్చిన జిల్లా, అధ్యక్ష కార్యదర్శుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అందరూ కలిసి కార్యాచరణ చేసి విజ్ఞాపన పత్రం అందరి అనుమతితో సమావేశం నుంచి బయలుదేరి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలపై వినతిపత్రం అందించారు. విఆర్‌ఎల కనీస వేతనం రూ.18వేలివ్వాలని, ప్రస్తుత, అన్ని నూతన జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్‌, వాచ్‌ మెన్‌ అటెండర్‌, డ్రైవర్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులను విఆర్‌ఎల చేత భర్తీ చేయాలని కోరారు. వద్ధాప్యంలో ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకుల స్థానంలో వారి వారసులను నామినీలుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరిస్తానని ఖచ్చితమైన హామీ ఇచ్చారు.
నూతన కమిటీ ఎన్నిక : మంగళవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీ ట్రెజరర్‌గా నంద్యాల జిల్లాకు చెందిన నారాయణ, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలానికి చెందిన కె.లోవరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అంకయ్య, నెల్లూరు జిల్లా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా హజరత్‌, నెల్లూరు జిల్లా రాష్ట్ర సహాయ ఉపాధ్యక్షులుగా గంగరాజు, కాకినాడ జిల్లా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నాగేశ్వరరావు పల్నాడు జిల్లా, నూతన రాష్ట్ర కమిటీలో బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర కమిటీ సమావేశానికి వచ్చిన అన్ని జిల్లాల విఆర్‌ఎలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎపి రెవెన్యూ జెఎసి నాయకులు వాస దివాకర్‌, రాష్ట్ర అధ్యక్షులు జి.ధైర్యం, ప్రధాన కార్యదర్శి కె.సత్య రాజు తదితరులు పాల్గొన్నారు.

➡️