ప్రజాశక్తి-నార్పల : మండల పరిధిలోని బీ.పప్పూరు ప్రాథమిక వైద్యశాల వైద్యులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ రవిశంకర్ కు జిల్లా ప్రోగ్రాం మానిటర్ ఆఫీసర్ గా పదోన్నతి వచ్చింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైద్యశాల పరిధిలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించే వైద్యాధికారికి పదోన్నతి లభించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు తోటి సిబ్బంది మండల ప్రజలు డాక్టర్ రవిశంకర్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.