ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : రైల్వే ప్రయివేటీకరణను ఆపాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి ఈరన్న, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, పీఎస్ గోపాల్, పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు లింగన్న డిమాండ్ చేశారు. గురువారం ఆదోని రైల్వే స్టేషన్ మాస్టర్ వెంకటేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే ప్రయివేటీకరణ వల్ల కార్పొరేట్ వారికే లబ్ధి చేకూరుతుందన్నారు రైల్వే ప్రవేటి కరణ వల్ల యువత అవకాశాలు కోల్పోతారన్నారు. ఇప్పటికే ఉద్యోగానియా మాకాలు చేపట్టకపోవడంతో యువత ఉపాధి కోల్పోయి తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారన్నారు లాభాలు అర్జించే రైల్వేను మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు ప్రభుత్వ రంగ సంస్థల్లో అతి పెద్దదైన రైల్వే రంగాన్ని ప్రతి ఒక్కరు కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు రద్దయిన రాయచూర్ నుండి కాకినాడ వరకు, గుల్బర్గా ప్యాసింజర్ రైళ్లను పునర్ధరించాలని, విజయవాడకు ప్రత్యేకంగా ట్రైన్ ఏర్పాటు చేయాలని ప్రయాణకులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, స్టేషన్‌లో 4 నెంబర్ ఫ్లాట్ ఫాంలో డిస్ ప్లే బోర్డును సరి చేయాలని, స్త్రీలకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఎలాంటి ఆలోచన ఘటన జరగకుండా పోలీసులు పందోబస్తు వచ్చారు ఈ కార్యక్రమంలో ఇక్బాల్, రామప్ప, భాష, హనుమంతు, ఆటో కార్మికులు పాల్గొన్నారు