రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం

Sep 14,2024 20:59

స్విచ్‌ ఆన్‌ చేసి చెరువుకు నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరిత

రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం
– ఎస్సార్‌బిసి నుండి మంచాలకట్ట చెరువుకు నీటి విడుదల
– పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్
డిప్రజాశక్తి – గడివేముల
ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని మంచాలకట్ట చెరువుకు ఎస్సార్‌బీసీ ఎత్తిపోతల పథకం నుండి ఎమ్మెల్యే స్విచ్‌ ఆన్‌ చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మోటార్లు చెడిపోయినా రిపేర్‌ చేయించకుండా గత పాలకులు రైతుల పట్ల నిర్లక్ష్యం వహించారని అన్నారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని టిడిపి సీనియర్‌ నాయకుడు మాజీ మండలాధ్యక్షులు వంగాల శ్రీనివాస్‌ రెడ్డి, నాయకులు వంగాల మురళీధర్‌ రెడ్డిలు లక్ష రూపాయల సొంత నిధులతో రెండు మోటార్లను రిపేరు చేయించారని చెప్పారు. ఎస్సార్‌ బీసీ నుండి మంచాలకట్ట చెరువుకు నీళ్లు విడుదల చేయడంతో గని, తలముడిపి గ్రామాలకు చెందిన దాదాపు మూడు వేల ఎకరాల్లో పంటలు సాగు చేసుకోవచ్చని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అన్నీ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. గండి పడిన అలగునూరు రిజర్వాయర్‌ పనులకు రూ. 34 కోట్లు మంజూరు అయ్యాయని, వెలగమాను డ్యాం పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని అన్నారు. హుసేనాపురం నుండి బ్రాహ్మణపల్లె వరకు డబల్‌ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, బ్రాహ్మణపల్లి నుండి గడివేముల వరకు రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదన పంపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు దేశం సత్యనారాయణ రెడ్డి, దేశం నారాయణరెడ్డి, పంట రామచంద్రారెడ్డి, ఎస్‌ఎ రఫిక్‌, కృష్ణ యాదవ్‌, శ్రీనివాస్‌ యాదవ్‌, కంది శ్రీనివాసులు, రాచమల్లి శ్రీనివాసులు, గణేష్‌ రెడ్డి, గని హర్షవర్ధన్‌, రాజు నాయక్‌, రంగస్వామి నాయక్‌, సర్పంచు మాలిక్‌ బాషా, గిరిబాబు, కృష్ణమాచారి, భాస్కర్‌ రెడ్డి, రాజారెడ్డి, పుల్లయ్య సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ బత్తుల సుభద్రమ్మ, ఒడ్డు లక్ష్మీదేవి, మాజీ ఎంపీటీసీ శిరీష పాల్గొన్నారు.

➡️