స్వర్ణాంధ్ర-2047 జిల్లా స్థాయి పోటీల్లో శ్రీ పద్మావతి విద్యార్థుల ప్రతిభ

Sep 30,2024 20:35

కలెక్టరేట్‌ చేతుల మీదుగా బహుమతులు అందుకుంటున్న విద్యార్థులు

స్వర్ణాంధ్ర-2047 జిల్లా స్థాయి పోటీల్లో శ్రీ పద్మావతి విద్యార్థుల ప్రతిభ
ప్రజాశక్తి – ఆత్మకూరు
ఆత్మకూరు పట్టణంలోని శ్రీ పద్మావతి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న ఎం.మదిహా, 8వ తరగతి చదువుతున్న ఎస్‌.ఆస్మ విద్యార్థులు సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని హోలీక్రాస్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర-2047 పోటీలలో ప్రతిభ చాటి రెండవ బహుమతి సాధించారు. స్వర్ణాంధ్ర-2047 కోసం జరిగిన పోటీల్లో ‘విద్యలో సంప్రదాయ మార్గాల కంటే వృత్తి శిక్షణకు ప్రాధాన్యత’ అంశంపై జరిగిన చర్చలో శ్రీ పద్మావతి స్కూల్‌ విద్యార్థులు మండల స్థాయిలో మొదటి బహుమతి, జిల్లా స్థాయిలో రెండవ బహుమతి సాధించి జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులను అభినందిస్తూ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్కూల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.ఆశ మాట్లాడారు. విద్యార్థులకు చదువుతో పాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ముర్తుజావలి, సురేష్‌, ఉపాధ్యాయ బృందం విజేతలకు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

➡️