ప్రజా సమస్యలకు వేగవంత పరిష్కారం

Sep 30,2024 20:34

వినతులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి

ప్రజా సమస్యలకు వేగవంత పరిష్కారం
– జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రజా వినతులను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రసెల్‌ సిస్టం – (పిజిఆర్‌ఎస్‌) కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులను కలెక్టర్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ప్రజా ఫిర్యాదులను సిఎం స్వయంగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు పూర్తిస్థాయి దృష్టి సారించాలన్నారు. తాను ఇటీవల పిజిఆర్‌ఎస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఫిర్యాదుల పరిష్కారంపై ఆడిట్‌ నిర్వహించగా 10 శాఖలు పొంతనలేని సమాధానంతో ఎండార్స్మెంట్‌ ఇచ్చారని, చదివి వినిపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎండార్స్‌ ఇచ్చిన విషయం ఫిర్యాదుదారునికి ఎందుకు సమాచారం ఇవ్వడం లేదనిప్రశ్నించారు. ఫిర్యాదుదారుడి సమస్యకు సరైన ఎండార్స్మెంట్‌ ఇవ్వడంలో ఎందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సరైన ఎండార్స్మెంట్‌ ఇవ్వని ప్రతి దరఖాస్తును రీఓపెన్‌ చేయిస్తామన్నారు. అర్జీలను ఎటువంటి పరిస్థితిలలో తిరస్కరించకుండా తెలుగులో అర్జీదారునికి అర్థమయ్యే రీతిలో నాలుగైదు వాక్యాలు స్పష్టంగా రాసి పంపాలన్నారు. కార్యక్రమంలో 307 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సి. విష్ణు చరణ్‌, డిఆర్‌ఒ ఎ.పద్మజ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు, పాల్గొన్నారు.స్వర్ణాంధ్ర-2047 క్విజ్‌ పోటీల విజేతలకు జ్ఞాపికలు ప్రదానం : స్వర్ణాంధ్ర-2047 విజన్‌ డాక్యుమెంట్‌పై పాఠశాలల విద్యార్థుల ఉపన్యాస భావాలు అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి సూచించారు. కలెక్టరేట్లోని సెంటనరీ హాలులో స్వర్ణాంధ్ర-2047 క్విజ్‌ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్‌, జెసిలు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

➡️