ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రికనుఅందజేస్తున్న దేవదాయశాఖ మంత్రి, కమిషనర్, శ్రీశైలం ఇఒ, అర్చకులు, వేదపండితులు
దసరా మహోత్సవాలకు సిఎంకు ఆహ్వానం
ప్రజాశక్తి – శ్రీశైలం
శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 3 నుండి 12వ తేదీ వరకు దసరా మహోత్సవాలు ఎంతో వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవదాయ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, శ్రీశైలం ఇఒ డి.పెద్దిరాజు, అర్చకస్వాములు, వేదపండితులు కలిసి దసరా మహోత్సవాల ఆహ్వానపత్రికను అందజేసి ఆహ్వానించారు. అనంతరం ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనంతో పాటు శేషవస్త్రాలు, ప్రసాదాలు, స్వామిఅమ్మవార్ల జ్ఞాపికను అందజేశారు. అలాగే రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, మానవ వనరులశాఖ అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేశ్‌లకు ఆహ్వానపత్రికలను వేర్వేరుగా అందజేసి ఉత్సవాలకు ఆహ్వానించారు. మంత్రులకు వేద ఆశీర్వచనంతో పాటు శేషవస్త్రాలు, ప్రసాదాలు, స్వామిఅమ్మవార్ల జ్ఞాపికను అందజేశారు. ఇఒ ఆదేశాల మేరకు దేవస్థానం అధికారులు, అర్చకస్వాములు నంద్యాలలో జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, ఎస్‌పి అధిరాజ్ సింగ్ రాణాకి, జెసి సి.విష్ణుచరణ్‌లకు ఆహ్వానపత్రికను అందజేసి ఉత్సవాలకు ఆహ్వానించారు.