బ్రహ్మసముద్రం (అనంతపురం) : ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో పలువురు కూలీలకు గాయాలైన ఘటన మంగళవారం బ్రహ్మసముద్రంలో జరిగింది. బ్రహ్మసముద్రం మండల పరిధిలోని కన్నేపల్లి గ్రామ సమీపంలో కూలీలను తరలిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో పలువురు కూలీలకు గాయాలయ్యాయి. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
