‘ఆడుదాం ఆంధ్ర’ను విజయవంతం చేయాలి కలెక్టర్‌

‘ఆడుదాం ఆంధ్ర’ను విజయవంతం చేయాలి కలెక్టర్‌ ప్రజాశక్తి – కడప ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడోత్సవాలను జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజయవంతం చేయాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు అధికారులను అదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడోత్సవాల నిర్వహణపై కలెక్టర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 ఏళ్లు పైబడిన అన్ని వయసుల వారిని క్రీడలలో భాగస్వామ్యం చేయడం ద్వారా శారీరక, మానసిక దఢత్వం, ఆనందాన్ని సొంతం అవుతాయని ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్భం గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తోందని తెలిపారు. అందులో భాగంగా పురుషులు, మహిళల కోసం 5 విభాగాల్లో వేర్వేరుగా క్రీడా పోటీలు నిర్వహిస్తోందని చెప్పారు. బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్‌లతో పాటు అన్ని స్థాయిలలో మూడు అదనపు గేమ్‌లను కవర్‌ చేస్తుందన్నారు. 3 కె మారథాన్‌, యోగా, టెన్నికాయిట్‌ ఆ ప్రాంతంలోని ప్రసిద్ధ సాంప్రదాయ ఆటలను.. గ్రామ సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహిస్తారన్నారు. క్రీడాకారులు సంబంధిత గ్రామ/వార్డు సచివాలయాల నివాసంగా ఉండాలన్నారు. వారి ఆధార్‌ కార్డ్‌ లేదా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డుతో పోటీలకు నమోదు చేసుకోవచ్చన్నారు. మండల స్థాయిలో అన్ని సచివాలయాల పరిధిలో నిర్వహించే క్రీడా పోటీలను సోషల్‌ మీడియా, లోకల్‌ ఛానెల్స్‌, ప్రెస్‌ ద్వారా విస్తత ప్రచారం జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. మండల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు నియోజకవర్గాల స్థాయిలో, నియోజకవర్గాల వారీగా ఎంపికైన విజేతలకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలో ఈ డిసెంబర్‌ 15 నుంచి 2024 జనవరి 20 వరకు, అలాగే గ్రామస్థాయిలో విజేతలకు డిసెంబర్‌ 21 నుంచి జనవరి 4 వరకు 12 రోజుల పాటు మండల స్థాయిలో క్రీడా పోటీలు జరుగుతాయన్నారు. జనవరి 5వ నుండి 10 వరకు 5 రోజుల పాటు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 11 నుండి 20 వరకు 7 రోజుల పాటు జిల్లా స్థాయిలో పోటీలుంటాయని వివరించారు. జనవరి 26 న రాష్ట్ర స్థాయి పోటీలు విశాఖపట్నంలో నిర్వహిస్తామన్నారు. క్రీడల్లో పాల్గొనే ఔత్సాహికులు డిసెంబర్‌ 27 నుంచి షషష.aaసబసaఎaఅసష్ట్రతీa.aజూ.స్త్రశీఙ.ఱఅ ద్వారా ఆన్‌ లైన్లో కానీ, గ్రామ వాలంటీర్ల ద్వారా డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ లో కానీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు. నియోజకవర్గ స్థాయి పోటీల్లో విజేతలకు మాత్రమే నగదు బహుమతులు అందజేస్తారని తెలిపారు.

➡️