సీఐటీయూ నగర కమిటీ పిలుపు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు త్రిప్పికొట్టాలనే లక్ష్యంతో సీఐటీయూ దేశ వ్యాప్తంగా మహ పడావో కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే ఈ నెల 27,28 న విజయవాడ జింకానా గ్రౌండ్లో సీఐటీయూ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తున్నామని దీనికీ విజయనగరం నుండి కార్మికులు కదలి రావాలని సీఐటీయూ నగర కార్యదర్శి బి.రమణ పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలో కన్యకా పరమేశ్వరీ కోవెల జంక్షన్ లో భవన నిర్మాణ కార్మికుల తో గోడ పత్రిక విడు దల చేశారు. ఈసందర్భంగా రమణ మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలు ను 4 కొడ్లుగా మార్చి కార్మిక హక్కులు కాలరాసిందని, అలాగే ప్రభుత్వరంగ సంస్థలు రైల్వే, టెలికాం, పోస్టల్, అన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తున్నదని, విశాఖ స్టీల్ కూడా అమ్మేస్తున్నారు. అయినా వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహ రిస్తున్నది. ఆలాగే భవన నిర్మాణ సంక్షేమం గాలికొదిలేసిoది. కలాసిలు సంక్షేమం, అసంగటిత రంగ కార్మికులకు, కనీస వేతనం లేకుండా చేస్తున్నది. ధరలు పెరిగి ఆకాశం నంటాయి. ఈ పరిస్తితుల్లో పోరాటం తప్పా మరో మార్గం లేదు. అందు కే సీఐటీయూ చేస్తున్నా మహాధర్నా లో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు త్రినాథ్, తది తరులు పాల్గొన్నారు.