ప్రజాశక్తి-ఆదోని : ఆదోని పట్టణంలో పూర్తికాని ప్రభుత్వ ఆసుపత్రుల ప్రారంభోత్సవాలపై ఉన్న శ్రద్ధ ప్రజలకు వైద్యమండించడందలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి లేకపోవడం విచారకరమని జనసేన నాయకులు రాజశేఖర్, తాహేర్ వలి, పులి రాజు విమర్శించారు. సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోనిలోని ఏరియా ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రి నూతన భవనాలు నిర్మాణ దశలో ఉన్న వాటిని యుద్ధ ప్రాతిపదికన ఎలా ప్రారంభించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాతా శిశు ఆసుపత్రిలో ప్రతిరోజు మహిళలకు స్కానింగ్ సదుపాయం కల్పించాలని, 24 గంటలు కాన్పులు జరిగే విధంగా వైద్యులను వైద్య పరికరాలను సమకూర్చాలన్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ పరికరాలు ఏర్పాటు చేయాలని, ఈసీజీ, వెంటిలేటర్ సిబ్బందిని నియమించాలని, నిర్మాణాలను వేగవంతం చేసి మెరుగైన వైద్యం అందించాలని పలుమార్లు కోరిన స్పందించకపోవడం సమంజసం కాదన్నారు డిమాండ్లు సాధన వరకు ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జనసేన పార్టీ నాయకులు రాజశేఖర్, మహేష్, రాకేష్, శ్యామ్, అయ్యప్ప, వెంకటేష్, గోవిందు, రాము, వేకటరముడు, తిమ్మప్ప, అజయ్, శ్రీనివాస్, ఎల్లప్ప, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.