గురజాడ గేయాలతో ర్యాలీ
ఆయన వాడిన వస్తువులు ప్రదర్శనతో
ప్రజాశక్తి-విజయనగరం కోట : మహాకవి గురజాడ అప్పారావు 108వ వర్థంతిని పురష్కరించుకుని గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.గురువారం నాడు స్థానిక గురజాడ అప్పారావు స్వగృహంలో ఆయన చిత్రపటానికి, విగ్రహానికి జ్యోతి ప్రదీపన కారిక్రమం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఆనంతరం ఆయన వాడిన కళ్ళ అద్దాలు, స్టాంపు, రచించిన కన్యాశుల్కం గ్రంథంతో అక్కడ నుండి ఊరేగింపుగా బయలుదేరి ఆయన రచించిన దేశభక్తి గేయాలను గురజాడ పబ్లిక్ స్కూల్, సన్ స్కూల్, త్యాగరాజ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ఆలపిస్తూ ఎం ఆర్ కళాశాల వద్ద ఉన్న గురజాడ విగ్రహానికి చేరుకోవడం అక్కడ ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి సమాఖ్య సభ్యులు, కవులు, కళాకారులు, గురజాడ అప్పారావు వారుసులు నివాళులు అర్పించారు. ఆనంతరం సమాఖ్య కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ మాట్లాడుతూ గురజాడ వర్ధంతి సందర్భంగా 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది గురజాడ సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో సమన్వత రీతిలో గురజాడ సాహితి చైతన్యస్వం నిర్వహించుకోవడం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో ఉత్తమ కవులను తీసుకోవడం జరిగింది. అందులో తెలంగాణ నుంచి నలుగురు మన ఆంధ్ర నుంచి ఆరుగురును ఎంపిక చేయడం జరిగింది గురజాడ స్మారక జిల్లా కేంద్రంలో కవులు గురజాడ ఉత్తమ కవితా పురస్కార గ్రహీతలు స్వీయ కవితా పఠనం చేయడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 3న ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ కు గురజాడ విశిష్ట పురస్కార ప్రదానోత్సవం ఆనందగజపతి కళాక్షేత్రంలో సాయంత్రం 6గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గప్రసాద్, పురస్కార ప్రదాత కోలగట్ల వీరభద్ర స్వామి, చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సమాఖ్య గౌరవం అధ్యక్షులు నరసింహారాజు, కోశాధికారి డా.ఎ.గోపాలరావు, గురజాడ వారసులు వెంకట ప్రసాద్,ఇందిరా, రొంగలి పోతున్న,జక్కు రామకృష్ణ, సూర్యలక్ష్మి కవులు, రచయితలు కళాకారులు పాల్గొన్నారు.