పేదవారికి ఉచిత వైద్య సేవలు అభినందనీయం

Nov 29,2023 16:45 #Vizianagaram
free health check up

సామాజికసేవ ప్రతి ఒక్కరిలో కలగాలి

వెంకట పద్మ ఫౌండేషన్ ద్వారా సేవ కార్యక్రమలు చేయడం శుభపరిణామం

పేద చిన్నారులు కోసం ఏర్పాటు చేసిన 20 ఉచిత బెడ్స్ ప్రారంభం
రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ కార్యాలయం ప్రారంభోత్సవం లో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : వెంకట పద్మ ఫౌండేషన్ ద్వారా ప్రముఖ చిన్నపిల్లలు వైద్య నిపుణులు డాక్టర్ ఎం.వెంకటేశ్వరావు దంపతులు పేద ప్రజలకు సేవలు అందించడం అభినందనీయం అని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. బుధవారం వెంకట పద్మ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ కార్యాలయం, వెంకటపద్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద చిన్నారులు కోసం రూపొందించిన 20 ఉచిత బెడ్స్ ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులుగా ఎం.వెంకటేశ్వరావు, పద్మ కుమారి దంపతులు వారి వృతికే పరిమితం కాకుండా ఎన్నో ఏళ్ళుగా రోటరీ క్లబ్ ద్వారా, వెంకట పద్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమలు నిర్వహించడం అభినందించదగ్గ విషయం అని తెలిపారు. వచ్చే ఏడాది లో రోటరీ గవర్నర్ గా ఎం. వెంకటేశ్వరావు బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో కార్యాలయం ప్రారంభించడం, ఈ కార్యాలయం ద్వారా అనేక సేవ కార్యక్రమలు చేయాలి అని ఆలోచన చేయడం హర్షించదగ్గ విషయం అని తెలిపారు. అలాగే వెంకట పద్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద చిన్నారులు కోసం 20 ఉచిత బెడ్స్ ని ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందించాలి అనే ఆలోచన రావడం శుభపరిణామం అని తెలిపారు. ఇలాగే మరిన్ని మంచి కార్యక్రమలు నిర్వహించాలి అని ఆకాక్షించారు. అనంతరం వైద్యులు వెంకటేశ్వరావు మాట్లాడుతూ పేద చిన్నారులు కోసం ఉచిత బెడ్స్ ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎప్పటినుండో ఉంది అని, ఇప్పుడు అది కార్యరూపం దాల్చింది అని తెలిపారు. జనరల్ వార్డు లో 12 బెడ్స్ వైద్యం, బెడ్స్ ఉచితంగా ఉంటాయి అని, మందులు, రక్త పరీక్షలుకి మాత్రమే తల్లిదండ్రులు డబ్బులు కట్టుకోవాల్సి ఉంటుంది అని తెలిపారు. అలాగే ఐ.సి.యు, ఎన్.ఐ.సి.యులో ఎనిమిది బెడ్స్ ఉచితముగా అందించడం జరుగుతుంది అని వీటి ఖరీదు ఒక్క బెడ్ రోజుకి ఆరు వేలు వరకు ఉన్న వాటిని కూడా ఉచితం గా అందించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ రెండింటికి సంబంధించి తల్లిదండ్రులు యంత్ర పరికరాలు ఖర్చు 1500 రోజుకి, మందులు, రక్త పరీక్షలు కోసం డబ్బులు కార్చుపెట్టుకోవాల్సి వస్తుంది అని తెలిపారు. రోటరీ గవర్నర్ గా వచ్చే ఏడాది బాధ్యతలు తీసుకుంటున్న తరుణంలో వచ్చే ఏడాది చేయాల్సిన సేవ కార్యక్రమలు గురుంచి ఈ ఏడాది నుండే కార్యచరణ చేయాలి అని కార్యాలయం ప్రారంభించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమం డిప్యూటీ స్పీకర్ స్వామి గారి చేతులు మీదుగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని, వారికి ప్రేత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రోటరీ సభ్యులు పాల్గొని డాక్టర్ వెంకటేశ్వరావు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

➡️