సత్తెనపల్లి టౌన్: తమ భవనంలో లీజు కాలం పూర్తయినా దౌర్జ న్యంగా వ్యాపారం చేస్తున్న పయనీర్ ఆటో మొబైల్ యాజమాన్యం తక్షణమే ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా ఆ షాపు ముందే ధర్నా చేస్తున్న ఎపి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సం ఘాన్ని శనివారం సిపిఎం పట్టణ, మండల నాయ కులు సందర్శించారు. వారికి పూర్తి సంఘీభావం తెలుపుతూ ధర్నాలో కూర్చున్నారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వం శాఖల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవీ విర మణ అనంతరం ప్రభుత్వం సహకారంతో సంఘ భవనాన్ని నిర్మించుకున్నారని, దానిని పయనీర్ ఆటో మొబైల్ సంస్థ యజమాన్యం నామ మాత్రపు అద్దెకు లీజుకు తీసుకుందని, లీజు కాలం పూర్తయిన ఖాళీ చేయడం లేదని అన్నారు. పయనీర్ ఆటో మొబైల్ సంస్థ మొండి వైఖరిని ప్రతి ఒక్కరూ ఖండించాలని, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం న్యాయపరమైన డిమాం డ్‌కు అండగా నిలవాలన్నారు. ప్రభుత్వం,పోలీసులు కూడా ఇప్పటికైనా ప్రేక్షక పాత్ర వీడి యాజమాన్యం పై తగు చేర్యలు తీసుకోవాలని, ఖాళీ చేయించి రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. అసోసియేషన్‌కు తాము అన్ని విధాలుగా సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.మహేష్, ఎ.వీరబ్రహ్మం, జె.రాజ్ కుమార్, ఎం.జగన్నాథం, పి.ప్రభాకర్, పి.సూర్య ప్రకాశరావు, ఆర్.పురుషోత్తం, అసోసియేషన్ నాయకులు పి రామకోటయ్య, అంకాళ్ళ ప్రభుదాస్, నరసింహారావు, హనుమంతరావు, లియోరాజ్, సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.