ప్రత్యామ్నాయం చూపిస్తామని కమీషనర్ హామీ..
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : బొగ్గుల దిబ్బ దళితుల ఇల్లు కూల్చేసి 11 నెలలు అయినా నేటికీ ప్రత్యామ్నాయం చూపలేదు, ఫలితంగా అద్దె ఇల్లులో ఉంటూన్నారు. అద్దెలు కట్టలేక నానా ఇబ్బందులూ పడుతున్న బొగ్గుల దిబ్బ దళితుల ఇళ్లు తొలగించిన చోటే నిర్మించాలని సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. శనివారం సిపీఎం అద్వర్యంలో విజయనగరం మున్సిపల్ కార్యలయం వద్ధ జరిగిన ధర్నా నిర్వహించారు.ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పట్టణాల్లో, నగరాల్లో ప్రభుత్వం భూముల్లో నివాసమున్న చోటే రెగ్యులరైజ్ చెయ్యాలనీ జీవో నెంబర్ 60 ఇచ్చిందన్నారు. దీన్ని తక్షణమే అమలు చేయాలనీ కోరారు. దళితుల ఆత్మ గౌరవం కాపాడేందుకు సీపీఎం ఎప్పుడు వారికి అండగా ఉంటుందని అన్నారు. హాస్పటిల్ ఏరియాలో రోడ్డు ప్రక్క ఉన్న వారికి జె ఎన్ టి యు వద్ధ ఇళ్లు నిర్మించి ఇచ్చారు. వారు ఇళ్ళల్లో దిగినాకే వారి ఇళ్లు తొలగించారు.అదే పద్ధతి బోగ్గులదిబ్బ దళితులు విషయంలో ఎందుకు పాటించలేదని అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని కమీషనర్ ధృష్టికి తీసుకెళ్లి వినతి పత్రం సమర్పించారు. దీనిపై కమీషనర్ స్పందిస్తూ కోర్టులో ఉన్న 18 ఇళ్లు తొలగించాము అని అన్నారు. పూర్తిగా ఇళ్లు ఇవ్వని వారికి ప్రత్యామ్నాయం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటి సభ్యులు పి. రమణమ్మ,కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అర్.ఆనంద్.బొగ్గుల దిబ్బబాధితురాలు అప్పల కొండమ్మ, తధితరులు పాల్గొన్నారు.