ప్రజాశక్తి – చెరుకుపల్లి
మండలంలోని పొన్నపల్లి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు దొంతుబోయిన సీతారెడ్డి, చెరుకుపల్లి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు వంగర మనోహర్ స్థానిక శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ సమక్షంలో వారు తమ అనుచరులతో టిడిపిలో చేరారు. మొదటి నుండి టిడిపికి వ్యతిరేకంగా ఉన్న వీరు వైసిపికి రాజీనామా చేసి టిడిపిలో చేరడం నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వీరితోపాటు దొంతిబోయిన శివారెడ్డి, పలువురు నాయకులు టిడిపిలో చేరారు. కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు పుషడపు కుమారస్వామి, తాత ఏడుకొండలు, పిన్నిబోయిన చింతారావు పాల్గొన్నారు.