ప్రజశక్తి – చీరాల
యార్లగడ్డ అన్నపూర్ణాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ రవణమ్మ ప్రారంభించారు. ఈ వర్క్ షాప్‌లో విద్యార్థులకు పనికిరాని వాటర్ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్, పేపర్స్, ట్యూబ్ లైట్లు తిరిగి ఎలా ఉపయోగకరంగా వినియోగించుకోవాలో వివరించారు. మొక్కలు, రకరకాల వస్తువులను తయారుచేసె విధానం వివరించారు. జంపులు శాస్త్రం విభాగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జంతు శాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ ఎన్ అంకమ్మ, ఇ రామరాజు పాల్గొన్నారు.