మహిళా మండలి రంగవల్లుల పోటీలు

Nov 27,2023 23:28

ప్రజాశక్తి – చీరాల
స్థానిక మహిళా మండలి ఎపిఎస్ ఎసిఎస్టి వన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కమ్యూనిటీ రంగోలి పోటీలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 1ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కమ్యూనిటీ ఈవెంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏయిడ్స్ దినోత్సవం వేడుకలలో భాగంగా ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు మాజీ మంత్రి జాగర్లమూడి లక్ష్మీపద్మావతి చేతుల మీదగా బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ముగ్గుల పోటీలలో ప్రాజెక్టు మేనేజర్ ఏ శ్రీనివాసరెడ్డి, సంధ్య, శిరీష, ఎఎన్ఎం అరుణ జ్యోతి, లలిత, ఏఒ గీత, సుకీర్తిన పాల్గొన్నారు.

➡️