చిన్న క్లబ్బుల అభివృద్ధికి కృషి చేస్తా : రోటరీ గవర్నర్ బూసిరెడ్డి శంకరరెడ్డి

Dec 2,2023 00:40

ప్రజాశక్తి – పంగులూరు
చిన్న క్లబ్‌లలో మంచి కార్యక్రమాలు జరుగుతాయని, అలాంటి క్లబ్బులను అభివృద్ధి చేయడం ద్వారా సమాజానికి ఎంతో ఉపయోగపడినవారు అవుతామని రోటరీ గవర్నర్ బూసిరెడ్డి శంకరరెడ్డి అన్నారు. హైదరాబాదు లాంటి పెద్ద పెద్ద క్లబ్బుల్లో వీక్లీ మీటింగ్లు జరగవని అన్నారు. చిన్న క్లబ్బులలో మాత్రం విధిగా జరుగుతాయని అన్నారు. అందుకే తనకు చిన్న క్లబ్బులంటే ఎంతో ఇష్టమని అన్నారు. చిన్న క్లబ్బుల అభివృద్ధికి తన వంతు సహకారం పూర్తిగా అందిస్తానని అన్నారు. స్థానిక రోటరీ భవనంలో క్లబ్‌ రోటరీ సభ్యులతో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్లబ్బుల్లో మెంబర్షిప్ ఎక్కువ పెరిగితే కార్యక్రమాలు కూడా ఎక్కువగా చేయగలమని అన్నారు. ప్రతి క్లబ్‌లో కార్యక్రమం చేయాలని అన్నారు. క్లబ్ పరిధిలో ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం, పార్కు ఏర్పాటు చేయటం, వ్యాయామశాలల్ని ఏర్పాటు చేయటం వంటి కార్యక్రమాలు చేయాలని కోరారు. ప్రాజెక్టు మంచిదైతే క్లబ్బు నుంచి డబ్బులు పెట్టకుండానే ఇంటర్నేషనల్ స్పాన్సర్ని చూసే అవకాశం ఉందని అన్నారు. అలాంటి వాటిని ఎంపిక చేసుకుని క్లబ్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మంచి ప్రాజెక్టులను గుర్తించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతుంటారని అన్నారు. వారి సమస్యలకు పరిష్కారంగా కార్యక్రమాలు చేస్తే వారు కూడా క్లబ్బుల్లో సభ్యులుగా చేరే అవకాశం ఉందని అన్నారు. వ్యాపారం, వృత్తి, ఆరోగ్యం, బాగున్నప్పుడే సామాజిక సేవ చేయగలుగుతారని అన్నారు. అసిస్టెంట్ గవర్నర్ ఇంటూరి ఆంజనేయులు మాట్లాడుతూ పంగులూరు రోటరీ క్లబ్ మిగతా క్లబ్బులకు ఆదర్శమని అన్నారు. ఇక్కడ నుండి ప్రాజెక్టులు తయారుచేసి పంపిస్తే గవర్నర్ ద్వారా పైకి పంపి మంజూరయ్యే విధంగా చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. స్థానిక హేమలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకున్న అనంతరం పాలకేంద్రం భవన్లోని మినరల్ వాటర్ ప్లాంట్‌ను, భూసార పరీక్షలు కేంద్రాన్ని పరిశీలించారు. రోటరీ భవన్‌కు నిర్మించిన ప్రహరీ గోడను ప్రారంభించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు కరణం హనుమంతరావు, డిస్ట్రిక్ట్‌ చైర్మన్ చిలుకూరు వీరరాఘవయ్య, కోశాధికారి గుర్రం ఆంజనేయులు, రొటీరియర్లు పెంట్యాల జగదీశ్వరరావు, తాటిచిన సుబ్బారావు, ఎనికపాటి శ్రీనివాసరావు, గరిమిడి జగన్మోహన్రావు, రాయిని రామారావు, బత్తుల వీర నారాయణ, రాయిని వెంకట సుబ్బారావు, ఇ మ్మడిశెట్టి సుబ్బారావు, గుడిపూడి రామారావు, నాగేశ్వరరావు, సీతారామయ్య, జాగర్లమూడి సుబ్బారావు, రామాంజనేయులు పాల్గొన్నారు.

➡️