వైసీపీలో అందరికి సంక్షేమ పధకాలు

Dec 2,2023 00:57

ప్రజాశక్తి – చీరాల
అర్హులైన లబ్ధిదారులు అందరికీ వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వైసిపి ఇంచార్జీ కరణం వెంకటేష్ ఆదేశాల మేరకు 28వ వార్డు కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు, 29వ వార్డు కౌన్సిలర్ బత్తుల అనిల్ అధ్యక్షతన హరిప్రసాద్ నగర్-2 సచివాలయం పరిధిలో ఆంధ్రప్రదేశ్‌కు జగనన్నే ఎందుకు కావాలంటే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షులు కొండ్రు బాబ్జీ, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, వైసిపి జిల్లా కార్యదర్శి శిఖా సురేష్, సల్లూరీ అనిల్, మాజీ కౌన్సిలర్ కాగితాల ప్రకాష్, మల్లెల లలితరాజశేఖర్, కంపా అరుణ్, తోకల అనిల్, కలవకూరి యానాదిరావు, పొత్తూరి సుబయ్య, కో ఆప్షన్ షేక్ కబీర్, షేక్ సుభానీ, అన్నం సతీష్, డొక్కా ప్రవీణ్, యాతం మేరీబాబు, అప్పల శ్రీనివాసరెడ్డి, తలకాయల సుధీర్, తుమ్మ బుజ్జి పాల్గొన్నారు.


రేపల్లె : ఆంధ్రప్రదేశ్‌కు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమాన్ని పిరట్లంక గ్రామంలో వైసిపి రూరల్ కన్వీనర్ గాదె వెంకయ్య బాబు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. సచివాలయంలో సంక్షేమ పథకాల బోర్డు ఆవిష్కరించారు. సిఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని అన్నారు. పథకాలు కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో తిరిగి జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉండన్నారు. కార్యక్రమంలో ఇఓపిఆర్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మండలి అంజయ్య, వైసిపి గ్రామ ఇంచార్జ్ పిరాట్లంక రాంబాబు, జడ్పిటిసి బొర్రా లక్ష్మిశ్రీనివాసరావు, కో ఆప్షన్ నెంబర్ ఫరీద్, పంచాయితీ సెక్రెటరీ గాదె విజయ్, మణి బాబు, ధూళిపాల పుల్లారావు, చెన్నుపల్లివారిపాలెం వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

➡️