వైసిపి పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమం

Nov 24,2023 00:31

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని పెద్దపులివరు గ్రామంలో రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలనే కార్యక్రమం గురువారం నిర్వహించారు. వైసిపి మండల కన్వీనర్ మోర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలకు అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరో మారు జగన్మోహన్ రెడ్డి సిఎం కావాలని వివరించారు. సంక్షేపం, అభివృద్ధి రెండు కన్నులుగా ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరించాలని కోరారు. తొలిత సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. గ్రామంలో వైసిపి జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ నీలా ఉషారాణి రమేష్, కో ఆప్షన్ సభ్యులు షేక్ సలీం, ఇఓపిఆర్డి ఊహారాణి పాల్గొన్నారు.
పెద్దపులివర్రు వైసీపీలో విభేదాలు
పెద్దపల్లివర్రు గ్రామంలో గురువారం జరిగిన ఏపీకి జగనే ఎందుకు కావాలనే కార్యక్రమంలో వైసిపి నాయకుల మధ్య విభేదాలు పొడ చూపాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంపీపీ డివి లలిత కుమారి, జడ్పిటిసి ఉదయ భాస్కరి ముందుండి నడిపిస్తున్నారు. కానీ ఎంపీపీ సొంత గ్రామమైన పెదపులివర్రులో జరిగిన కార్యక్రమంలో వాళ్లిద్దరూ కనిపించకపోవడం గ్రామంలో విమర్శకు కారణమైంది. ఈ గ్రామంలో సర్పంచ్, ఎంపీపీ మధ్య విభేదాలు ఉన్నట్లు పలువురు వైసిపి నాయకులు వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విభేదాలు ఇదే రీతిలో కొనసాగితే వైసిపి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని వైసిపి నాయకులే అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.

➡️