ప్రజాశక్తి – చీరాల
పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈనెల 10న విజయవాడలో జరిగే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని కోరారు. ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ ఔట్సోర్సింగ్ ఉద్యోగ, కార్మిక సమస్యలు పరిష్కారం కావడంలేదని అన్నారు. కనీస హక్కులు కూడా సాధించుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే బాధాకరంగా ఉందని అన్నారు. అంగనవాడిలు, వీఆర్ఏలు అనేక పోరాటాలు చేసి ఉద్యోగ భద్రత సాధించుకున్నారని గుర్తు చేశారు. వారిని చూసైనా పోరాటాలతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు భద్రతను సాధించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి సురేష్, శాంతకుమార్, వెంకట్, బాజీ, వీరస్వామి, సునీల్ పాల్గొన్నారు.