ప్రజాశక్తి- రేపల్లె
డిసెంబర్ 3న స్థానిక ఎంసీఎ హాల్లో జరిగే స్వర్ణోత్సవ వేడుకలు, ద్వితీయ కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని యుటిఎఫ్ బాపట్ల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె వినయ్ కుమార్, అడుగుల శ్రీనివాసరావు కోరారు. ప్రాంతీయ శాఖల ఆధ్వర్వంలో స్వర్ణోత్సవ, జిల్లా కెన్సిల్కు సంబంధించిన కర పత్రాన్ని మంగళవారం ఆవిష్కరించారు. డిసెంబరు 3న స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ర్యాలీ, సభ ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం నుండి ప్రతి నిధుల సభ జరుగుతుందని అన్నారు. సభకు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, కొమ్మెజు నివాసరావు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు, ఎంఎల్ఎ అనగాని సత్య ప్రసాద్, ఎంఎల్సి కెఎస్ లక్ష్మణరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, యుటిఎఫ్ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎంవిబి సుబ్రమణ్యం, రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్ బాపయ్య, యుటిఎఫ్ సీనియర్ నాయకులు కె సాయిప్రసాద్, జి సుబ్రహ్మణ్యం, కెపి నాయడు, రవీంద్ర, రేపల్లే ప్రాంతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.