‘ఆడుదాం ఆంధ్ర’పై శిక్షణ

Nov 24,2023 00:35

ప్రజాశక్తి – నగరం
స్థానిక మండల పరిషత్ కార్యలయంలో ఆడుదాం ఆంద్ర కార్యక్రమంపై శిక్షణ నిర్వహించారు. డిసెంబర్ 15నుండి జనవరి 26వరకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంపై గ్రామ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, సచివాలయ మహిళా పోలీసులు, హెచ్‌ఎంలకు ఏర్పాటుచేసిన శిక్షణలో ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య మాట్లాడారు. రాష్ట్ర ప్రబుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు ఎం ప్రమీల, ఎంపీడీఒ చక్రపాణి ప్రసాద్, ఎంఈఓ కొలసాని హరిబాబు పాల్గొన్నారు.


చెరుకుపల్లి : క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చని, ప్రతి ఒక్కరూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం అయ్యేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి ఎంపిడిఓ నాగలక్ష్మి సూచించారు. డిసెంబర్ 15నుండి జరగనున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అమలుపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బందితో చర్చించారు. కార్యక్రమంలో తహసిల్దార్ బి వెంకటేశ్వర్లు, ఎంఈఓ టి నవీన్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

➡️