సస్యరక్షణపై రైతులకు శిక్షణ

Nov 23,2023 00:31

ప్రజాశక్తి – పర్చూరు
మండలంలోని కొత్తపాలెం గ్రామంలో ఆత్మ సౌజన్యంతో ఏడిఏ మోహనరావు అధ్యక్షతన జిల్లా వనరుల కేంద్రం, ఏరువాక కేంద్రం నుండి వచ్చిన శాస్త్రవేత్తలు సమగ్ర సస్యరక్షణ, యాజమాన్య పద్దతులపై రైతులకు సుచలు, సలహాలు ఇచ్చారు. రబీ సీజన్‌లో వేసిన పంటలు మీద, ఖరీఫ్‌లో వేసిన పంటల మీద రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. వరి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్‌ సాంబశివరావు మాట్లాడుతూ వరిలో ఉల్లి కొడు కనపడుతున్నదని అన్నారు. దీని నివారణకు ఎకారానికి కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు 10కేజీలు లేదా ఫోరేట్ 10జి గుళికలు ఏకరనికి 5కేజీలు వాడాలని అన్నారు. పై పాటున క్లోరోఫైరిపాస్‌ 20ఇసి ఏకరాణికి 500ఎంఎల్‌ పిచికారి చేయాలని అన్నారు. మిరప పైరులను పరిశీలించి ఆకు ముడత, బొబ్బర తెగులు కనిపిస్తున్నదని తెలిపారు. నల్ల తామర పురుగుల నివారణకు వేపగింజల కషాయాన్ని, నీలి రంగు జిగురు అట్టలను ఏకరానికి 20 నుండి 30 వరకు పెట్టుకోవాలని సూచించారు. పురుగు నివారణకు సై యంట్రినిపోలు 240ఎంఎల్‌, లేదా స్పైరో టెట్రామెట్ 200ఎంఎల్‌ లేదా స్పినోటోరామ్ 200 ఎంఎల్‌ లేదా థయోమేతాక్సికాం 160గ్రాములు చల్లి నివారించు కోవచ్చని అన్నారు. ఏరువాక సైంటిస్ట్ డాక్టర్‌ ఓబయ్య మాట్లాడుతూ మొక్కజొన్నలో వచ్చు కత్తేరపురుగు నివారణ గురించి వివరించారు. ఇమమెక్టిన్ బెంజొట్ 80గ్రాములు లేదా స్పైనోసాడ్ మందు 60ఎంఎల్‌ మందును 200వందల లీటర్ల నీటిలో కలిపి మొక్కజొన్న మొవ్వు లోపలి భాగాలు తడిచేటట్లు పిచికారి చేయాలని అన్నారు. డాక్టర్‌ రామకృష్ణ మాట్లడుతూ మినుము, శనగలలో వచ్చు తెగుళ్లు, పురుగుల గురించి వివరించారు. బాపట్ల డిఆర్‌సి, డిడిఎ విజయ నిర్మల మాట్లాడుతూ రబీ సీజన్‌లో వరికి బదులు ఆల్టర్నేట్ పంటలైన శనగ, మొక్కజొన్న, మినుము, పెసలు వేసుకోవాలని తెలిపారు. మోహనరావు మాట్లాడుతూ రబీలో ప్రతి ఒక్కరూ ఈ క్రాప్ బుకింగ్‌ చేయించు కోవాలని అన్నారు. రైతు సోదరులకు ఖరీఫ్‌లో వేసిన పంటలకు, ఈ క్రాప్‌ బుకింగ్‌ ఫిజికల్‌ ఎక్‌లాజ్జిమెంట్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఆర్‌బికెలలో కావలసిన ఎరువులు అందు బాటులో ఉన్నాయని అన్నారు. ఎంఏఓ రామ్మోహన్‌రెడ్డి శనగ విత్తనాలకు విత్తన శుద్ధి చేసి చూయించారు. కార్యక్రమంలో సర్పంచ్, విఏఏలు హేమంత్, నాగబాబు, రైతు సోదరులు పాల్గొన్నారు.

➡️