ప్రజాశక్తి – బాపట్ల
ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అంతర అనుబంధ కళాశాలల ప్రథమ దశ క్రీడా పోటీల్లో విజేతల వివరాలను కళాశాల అసోసియేట్ డీన్ వి .శ్రీనివాసరావు బుధవారం విలేకరులకు తెలిపారు. రెండు రోజులపాటు జరిగిన ఆటల పోటీల్లో చెస్ పోటీలో తిరుపతి కళాశాల విజేతగా నిలిచింది. బాపట్ల వ్యవసాయ కళాశాల రన్నర్ కాగా, నైరా వ్యవసాయ కళాశాల, తిరుపతి ఎస్‌వి వ్యవసాయ కళాశాల మధ్య జరిగిన బాల్ బాడ్మింటన్ ఫైనల్ పోటీలో నైరా కళాశాల ప్రథమ స్ధానంలో నిలిచింది. తిరుపతి కళాశాల ద్వితీయ స్థానం దక్కించుకుంది. వాలీబాల్ పోటీల్లో బాపట్ల వ్యవసాయ కళాశాల, నైరా వ్యవసాయ కళాశాల ఫైనల్స్‌కు చేరుకున్నాయి. కారమ్స్‌లో తిరుపతి ఎస్‌వి వ్యవసాయ కళాశాల, ఎచ్చర్ల కింజరాపు ఎర్రన్నాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. బాస్కెట్ బాల్ పోటీలో తిరుపతి ఎస్‌వి వ్యవసాయ కళాశాల, నైరా వ్యవసాయ కళాశాల ఫైనల్స్‌కు చేరుకోగా, టేబుల్ టెన్నిస్ పోటీలో బాపట్ల వ్యవసాయ కళాశాల ఫైనల్స్‌కు చేరుకున్నట్లు వివరించారు. క్రీడలను విశ్వ విద్యాలయ ఫిజికల్ డైరెక్టర్ ఆర్ రవికాంత్‌రెడ్డి, ఆఫీసర్ ఇంచార్జి ఆఫ్ స్టూడెంట్ యాక్టివిటీస్ టివి శ్రీధర్ పర్యవేక్షించారు.