ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్
గత కొంత కాలంగా పంచాయితీ కార్యాలయంలో నిధుల దుర్వినియోగంపై విచారణ జరుగుతున్న నేపధ్యంలో సోమవారం రాత్రి పంచాయితీ కార్యాలయంలోని రికార్డులను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నాయబ్‌రసూల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దగ్దమైన తీరును పరిశీలించారు. పంచాయితీ గుమస్తా చైతన్య, ఇఒ పిఆర్‌డి కె శ్రీనివాసరావు నుండి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాద వశాత్తు దగ్దమయ్యాయా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారా? అనేది పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది.