రైతులు సమస్యలు చెప్పండి

Nov 24,2023 00:24

ప్రజాశక్తి – పంగులూరు
రైతులకు పంటల సాగులో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని మండలంలోని బయట మంజులూరు రైతు భరోసా కేంద్రం విఏఏ గురజాల పృధ్వీ సాయి కోరారు. స్థానిక సచివాలయంలో రైతులతో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్‌బికె పరిధిలో బయట మంజులూరు, భగవాన్ రాజు పాలెం గ్రామాలు ఉన్నాయని అన్నారు. బయట మంజులూరు గ్రామంలో ఈ సంవత్సరం ఖరీఫ్‌లో 114మంది రైతులు 365ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారని అన్నారు. ఇందులో వరి 45ఎకరాలు, మినుము 184ఎకరాలు, మిరప 12ఎకరాలు, సుబాబుల్ 124ఎకరాల్లో సాగు చేశారని చెప్పారు. రభీ ఈ క్రాప్ ఇంకా మొదలు కాలేదని తెలిపారు. ఈ క్రాప్ మొదలైన వెంటనే రైతులకు తెలియజేస్తామని చెప్పారు. అప్పుడు రైతులంతా ఈ క్రాప్ చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం ఆర్‌బికె ద్వారా 40శాతం సబ్సిడీపై శనగ విత్తనాలు ఇస్తున్నామని తెలిపారు. శనగ పంట సాగు చేసే రైతాంగం విత్తనాలు తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో ఎనర్జీ అసిస్టెంట్ నార్ని అనిల్, రైతు చక్రవరం శ్రీరంగరాజు పాల్గొన్నారు.

➡️