గంగవరం విద్యార్ధుల ప్రతిభ

Dec 2,2023 00:51

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌
గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కెఎల్‌ యూనివర్సిటిలో నవంబరు 29, 30 తేదీల్లో నిర్వహించిన జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రేస్‌ ప్రాజెక్టుల ప్రదర్శనలో మండలంలోని గంగవరం శ్రీ వలేటి కృష్ణయ్య ఉన్నత పాఠశాల విద్యార్ధులు ప్రతిభ కనబర్చారు. రాష్ర్టం నుండి 26 ఉత్తమ ప్రాజెక్టులుగా ఎంపిక చేయగా విద్యార్ధులు పెద్దపల్లి అంకిత, కట్టా సాహితీ ప్రదర్శించిన బుల్లేట్‌ మిల్లేట్స్‌ ప్రాజెక్టు కెవిఆర్‌ సైంటిఫిక్‌ సొసైటికి ఎంపికైంది. ప్రాజెక్టు రూపకల్పనలో గైడ్‌గా వ్యవహరించిన మేడికొండ సుమలతను పాఠశాల కరస్సాండెంట్‌ ఎం శ్రీనివాసరావు, హెచ్‌ఎం కె వీరాంజనేయులు అభినందించారు.

➡️