మహిళల కబడ్డీ జట్ల ఎంపిక

Nov 25,2023 00:17

ప్రజాశక్తి బాపట్ల
ఉమ్మడి గుంటూరు జిల్లా మహిళా కబడ్డీ జట్టు ఎంపిక స్థానిక మునిసిపల్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించినట్లు హై స్కూలు పిడి కత్తి శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. కబడి జిల్లా జట్టు ఎంపికకు 40మంది క్రీడాకారిణిలు హాజరైనట్లు తెలిపారు. వారిలో ప్రతిభగల 12మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇక్కడ ఎంపికైన కబడి మహిళల జట్టు ఈనెల 29, 30, డిసెంబరు 1న కర్నూలులో జరిగే 70వ అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి మహిళల కబడ్డీ జట్టు ఎంపికలో పాల్గొంటారని తెలిపారు. జట్టులో జి పూర్ణిమ (గుంటూరు), పి వరలక్ష్మి (బొల్లాపల్లి), ఎ’ దీపిక (బాపట్ల), బి శివమాయి (నకరికల్లు), త్రివేణి (నరసరావుపేట), జి లావణ్య (లోయపల్లి), పి భార్గవి (చిన లింగాయపాలెం), బి ప్రేమ చందన (బాపట్ల), ఎస్ వసంత (ఖాజీపాలెం), బి రమాదేవి (నిజాంపట్నం), ఎం స్వాతి (పోతురాజు కొత్తపాలెం), టి అనిత (కొచ్చర్ల), కె మహాలక్ష్మి (ఎన్ఆర్ తోట), ఎన్ కావ్య (నండూరు), ఎం లావణ్య (పాండురంగాపురం), పి యామిని (వైఎస్ నగరం) ఉన్నట్లు తెలిపారు. జట్ల ఎంపిక గుంటూరు జిల్లా క్రీడా కార్యదర్శి సుబ్బరాజు ఆధ్వర్యంలో పీడీ జి కుటుంబరావు, వై రాము, పిఈటి వైఎస్ఆర్ ప్రసాద్, సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు పి నాగులు ఎంపిక చేసినట్లు తెలిపారు.

➡️