ప్రజాశక్తి – సంతమాగులూరు
పాఠశాలలకు తరచుగా హాజరుకాని విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి హాజరయ్యే విధంగా చూడాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి వెల్ఫేర్ అసిస్టెంట్లు, సిఆర్పిలు, ఎంఎస్‌కెలను ఆదేశించారు. మండలంలోని ఏల్చూరు, పుట్టావారిపాలెం గ్రామాలలోని అంగన్ వాడి సెంటర్స్, పుట్టావారిపాలెం ఎంపీయుపి పాఠశాలను ఆమె మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి తమ పిల్లలు పాఠశాలలకు హాజరు అయ్యే విధంగా చూడాలని ఎంఇఒ వేమవరపు కోటేశ్వరరావుకు సూచించారు. పాఠశాలలోని విద్యార్థులను ప్రశ్నించి, విద్యా ప్రమాణాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ నాగూర్ వలి, ఎంఈఓ వి కోటేశ్వరరావు, హెచ్‌ఎం శేఖర్ బాబు పాల్గొన్నారు.