ప్రజాశక్తి – చీరాల
రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని మసీదు సెంటర్లో రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. పట్టణానికి వచ్చేందుకు ప్రధాన రహదారి అయిన మసీదు సెంటర్ రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు త్వరితగతిన పనులు పూర్తిచేసి రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఆయన వెంట వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అమృతపాణి, మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, కంపా అరుణ్, గుంటూరు ప్రభాకరరావు, కలవకూరి యానాదిరావు, గొట్టిపాటి ఎబినేజర్, తోకల అనిల్, కోలా శివ, కోడూరి ప్రసాదరెడ్డి, మల్లీ రామకృష్ణ, దామర్ల శ్రీకృష్ణ, కట్టా గంగయ్య, మునిసిపల్ డిఈ ఐసయ్య, ఏఈ కట్టా రవి ఉన్నారు.