‘ఆడుదాం ఆంధ్ర’ కోసం నమోదు చేయించుకోవాలి

Nov 25,2023 00:19

ప్రజాశక్తి – భట్టిప్రోలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుతా ఆంధ్ర కార్యక్రమానికి యువతీ, యువకులు తమ పేర్లను నమోదు చేయించుకోవాలని ఎంపీపీ డివి లలిత కుమారి సూచించారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. 15 సంవత్సరాలు పైబడిన విద్యార్థినీ, విద్యార్థులు ఈనెల 27నుండి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు. క్రికెట్, కబడ్డీ, కోకో, వాలీబాల్ వంటి ఆటల్లో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుందని అన్నారు. నమోదు చేయించుకున్న వారికి క్రీడా సామాగ్రి, దుస్తులు అందజేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ, జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి నగదు బాహుమతులు ఇస్తారని తెలిపారు. మహిళా క్రీడాకారులకు కూడా ప్రత్యేక టీంలు ఉన్నాయని తెలిపారు. సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జడ్పిటిసి తిరుగుదుల ఉదయభాస్కరి, తహశీల్దారు డి వెంకటేశ్వరరావు, ఎంపీడీఒ గుమ్మా చంద్రశేఖర్ పాల్గొన్నారు.

➡️