ప్రజాశక్తి – భట్టిప్రోలు (వేమూరు)
వేమూరు నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా అమృతలూరు మండలం పాంచాలవరం సర్పంచ్ పావులూరి హేమ చంద్ ఎన్నికయ్యారు. మాజీ మంత్రి, టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబును ఆయన కలిసి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచులు సంఘం అధ్యక్షుడిగా సర్పంచుల సమస్యలపై నిరంతరం పోరాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హేమచంద్కు సూచించారు. ఈ మేరకు నూతనంగా ఎన్నికైన హేమచెంద్ను షాలువాతో సత్కరించారు. పంచాయతీల నిధులన్నీ ప్రభుత్వం దోచుకుని పంచాయతీలను నిర్వీర్యం చేసిందని అన్నారు. పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వీలు లేదని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దీనిపై అందరితో సమీక్షించి తగిన న్యాయం జరిగే విధంగా చూడాలని సూచించారు. ఆయన వెంట టిడిపి మండల అధ్యక్షులు వెన్న బెనర్జీ ఉన్నారు.