ఎయిడ్స్‌ బాధితుపై వివక్ష వద్దు

Nov 28,2023 23:58

ప్రజాశక్తి – అద్దంకి
హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితుల పట్ల ప్రేమ, ఆప్యాయత కలిగి ఉండాలని, వివక్షత చూపించకూడదని స్థానిక ప్రభుత్వం జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కె రాజేశ్వరమ్మ పేర్కొన్నారు. హెల్ప్‌టిఐ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీలో విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. సదస్సులో ఎజిపి వై రమేష్ బాబు మాట్లాడుతూ హెచ్ఐవి, ఎయిడ్స్‌పై ప్రజలను చైతన్య పరచాల్సిన బాధ్యతప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితులకు పౌష్టికాహారం అందించడంలో అవగాహన కలిగించాలని అన్నారు. హెల్ప్ టిఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ మాట్లాడుతూ హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితులు సకాలంలో మందులు వాడుకునే విధంగా, కండోమ్ వినియోగంపై ప్రచారం చేయాలని అన్నారు. యువత చిన్న వయసులోనే ప్రేమపేరుతో అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఇప్పటికీ హెచ్ఐవి, ఎయిడ్స్ కేసులు నమోదులో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధికంగా కేసు నమోదవుతున్నాయని అన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు. వ్యాధి ప్రజల్లో ప్రబలకుండా ప్రజలను చైతన్య పరచాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే వ్యాధి నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల పిడి కె డేవిడ్ రాజు, హెల్ప్ టిఐ ఔట్రిచ్ వర్కర్స్ వి కరుణ, టి శ్రావణి, పిఈ మల్లేశ్వరి, పార్వతి పాల్గొన్నారు.

➡️