ప్రజాశక్తి – చీరాల
యుపి మాజీ సిఎం మలాయం సింగ్ యాదవ్ 84వ జయంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక గడియార స్తంభం వద్ద ఉన్న విగ్రహానికి ఎస్‌పి జిల్లా అధ్యక్షులు గొర్ల శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో అర్భన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు యాదవ్, చీరాల నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.