కోడూరుకు ప్రశంసా పత్రం

Nov 29,2023 00:03

ప్రజాశక్తి – భట్టిప్రోలు
ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉచితంగా కార్పెంటర్ సేవలు అందజేసిన కోడూరు వెంకటేశ్వరరావుకు అఖిల భారత విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంజూరైన ప్రశంసా పత్రాన్ని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం అందజేశారు. వెంకటేశ్వరరావు సేవా దృక్పథంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారని పలువురు అన్నారు. దీనిలో భాగంగా ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకం కింద అనేక మందిని ప్రోత్సహించి గుర్తింపు కార్డుల కొరకు రిజిస్ట్రేషన్ కూడా చేయించటం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లలిత కుమారి, జడ్పిటిసి ఉదయభాస్కరి, మండల ఉపాధ్యక్షులు కె పిచ్చయ్యశాస్త్రి, వెల్లటూరు పంచాయతీ కార్యదర్శి రామ్ కుమార్, ఏఒ శైలజ, వైసిపి నాయకులు మల్లేశ్వరరావు, బాలాజీ పాల్గొన్నారు.

➡️