ప్రజాశక్తి – అద్దంకి
మండలంలోని మాణి కేశ్వరం గ్రామంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. గుండ్లకమ్మ నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. ట్రస్టు బోర్డు విజయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మౌలిక వసతులను కల్పించారు. భక్తులకు ఉచితంగా ప్రసాదాలను తన సహాయ సహకారాలతో అందిస్తున్నారు. కొరిసపాడు మండలం మేదరమెట్లకు చెందిన నిడమానూరి నాగేశ్వరరావు, హనుమంతురావు భక్తులకు ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఈదా శ్రీనివాసరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.