ప్రజాశక్తి – నిజాంపట్నం
జన విజ్ఞాన వేదిక నూతన కమిటీ ఎన్నికను స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా నిజాంపట్నం హైస్కూల్ హెచ్ఎం శివన్నారాయణ, అధ్యక్షులుగా జికె పేట ఎంపిపి స్కూల్ ఎస్ఎ దబ్బకూటి హరిబాబు, సహాధ్యక్షులుగా పి ఏడుకొండలు, ప్రధాన కార్యదర్శిగా నిజాంపట్నం జడ్పీహెచ్ఎస్ ప్రసాద్, కోశాధికారిగా ఎండి హుస్సేన్, సభ్యులుగా యు కుమార్, ఎస్ ధర్వేష్, చంద్రయ్య, అబుల్ మాలిక్, సత్యనారాయణ, ఎం విజయలక్ష్మి ఎన్నికయ్యారు. యుటిఎఫ్ బాపట్ల జిల్లా అధ్యక్షులు జె వినయ్ కుమార్ మాట్లాడుతూ మూఢాచారాలను పారదోలటం, విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి జన విజ్ఞాన వేదిక ఎంతో కృషి చేస్తుందని అన్నారు. నూతన అధ్యక్షులు దబ్బకూటి హరిబాబు మాట్లాడుతూ జెవివి సహకారంతో విద్యార్థులకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్ట నున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్ బాపయ్య, యుటిఎఫ్ నిజాంపట్నం మండలం అధ్యక్షులు కె రాజేష్, ప్రధాన కార్యదర్శి గణేష్రావు పాల్గొన్నారు.