ప్రజాశక్తి -రేపల్లె
రాష్ట్ర అభివృద్ధికి సిఎం జగనన్న సేవలు ఎంతో అవసరమని కౌన్సిలర్ చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని 14, 15వార్డులో శుక్రవారం నిర్వహించిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని అన్నారు. పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులను, నేతన్నలను, మత్స్యకారులను, స్వయం ఉపాధి కలిగిన ప్రతి ఒక్కరికి బాసటగా నిలిచి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. పరాదర్శకంగా లబ్దిదారుల ఖాతాలలో నగదును జమచేస్తూ ఆర్ధిక సహాయం అందించారని అన్నారు. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం ద్వారా అధికారులను ప్రజల వద్దకు చేర్చారని అన్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సేవలను ప్రజలు గుర్తించాలని కోరారు. మరోసారి గెలిపించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలు పొందిన లబ్దిని తెలియజేసే కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కట్టా మంగా, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రశాంత్ కుమార్, విశ్వనాథ గుప్తా, వైసిపి పట్టణ అధ్యక్షులు గడ్డం రాధాకృష్ణమూర్తి, చదలవాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు.