ప్రజాశక్తి- మద్దిపాడు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని టిడిపి మండల అధ్యక్షులు మండవ జయంత్ బాబు అన్నారు. మండలంలోని అన్నంగి గ్రామంలో బుధవారం రాత్రి వైసీపీని తరిమికొట్టండి, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్ళి ఫోన్లో షూరిటీలో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేశారు. జయంత్ బాబు
మాట్లాడుతూ చౌకబారు మద్యం అధిక ధరలకు అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. టిడిపి అధికారానికి వస్తే అమలు చేయబోయే పధకాలను వివరించారు. ఆడబిడ్డ నిధి కింద 18ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500, తల్లికి వందనం పథకం క్రింద ప్రతి ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఏడాదికి రూ.15వేలు ఖాతాల్లో జమ చేస్తారని తెలిపారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత మంచినీటి సరఫరా, అన్నదాత పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సహాయం, యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేల బృతి, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి అన్ని విధాల వారికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. పూర్ టు రిచ్ పథకం ద్వారా పేదలను సంపన్నులుగా మార్చే కార్యక్రమం అమలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి గ్రామ అధ్యక్షులు నారిపెద్ది అనిల్, క్లస్టర్ ఇంచార్జి దేవబత్తిన ప్రసాదరావు, యూనిట్ ఇంచార్జ్ ముళ్ళూరి మురళి, మండవ గోపి చంద్, చింతల శ్రీను, మాజీ ఎంపీటీసీ పొద కొండయ్య, అన్నాబత్తిన శివ, అన్నాబత్తిన హనుమంతరావు, రాయపాటి రమేష్ బాబు, నల్లూరి సురేష్, కొమ్మాలపాటి సుబ్బారావు, నారా సురేష్, నలమోతు బాబూ, అన్నాబత్తిన పవన్, ఐటీడీపీ నాగరాజు, రాయపాటి హనుమంతరావు, మాదాల లక్ష్మీనారాయణ, బుర్రి బసవయ్య, కటారి రామారావు పాల్గొన్నారు.