ప్రజాశక్తి – పంగులూరు
స్థానిక మన గ్రోమోర్ ఎరువులు దుకాణంను ఎఒ సుబ్బారెడ్డి బుధవారం పరిశీలించారు. దుకాణంలో ఉన్న ఎరువులు, పురుగు మందులు, వాటి బిల్లులు, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎఒ సుబ్బారెడ్డి మాట్లాడుతూ మన గ్రోమోర్ ఎరువుల దుకాణంలోని ఎరువులు, పురుగు మందులు నాణ్యత ప్రమాణాలను పరిశీలించినట్లు చెప్పారు. సరుకు అనుమతులను పరీక్షించామన్నారు. బెంజోయేట్, బెకోరా అనే రెండు పురుగు మందుల నంమూనాలు పరిశీలన నిమిత్తం తీసుకున్నట్లు చెప్పారు. ఎరువులకు సంబంధించి అన్ని పరిశీలించమని అన్నారు. అన్ని సక్రమంగానే ఉన్నాయని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల్లో, బయటి షాపుల్లో ఎరువుల ధరలకు, మన గ్రోమోర్ షాపులో ఎరువుల ధరలకు వ్యత్యాసం ఉందా అని ప్రశ్నించగా 20:20:0:13, 28:28:0:14, 35:14, ఎరువులు రైతు భరోసా కేంద్రాల్లో, బయట ఎరువులు షాపుల్లో, ఓల్డ్ స్టాక్ ఉండటం వలన వాటి ఎమ్మార్పీ రూ.1,200 మాత్రమే ఉందని, వాళ్ళు ఆ ధరకే అమ్ముతున్నారని చెప్పారు. మన గ్రోమోర్ సెంటర్లో ఎరువులు కొత్తవి కావడం వలన వాటిపై ప్రభుత్వం ఇటీవల సబ్సిడీ తగ్గించటం వలన రూ.1,350కి అమ్ముతున్నామని మన గ్రోమోర్‌లో పనిచేసే ఉద్యోగి తెలిపారు. ఈ సంవత్సరం మండలంలో జేజే-11 రకం శనగ విత్తనాలు 875క్వింటాళ్లు, కాక్ -2 రకం శనగ విత్తనాలు 874క్వింటాళ్లు వచ్చాయని ఎఒ తెలిపారు. వాటిని 40శాతం సబ్సిడీపై రైతులకు అందజేస్తున్నామని తెలిపారు.