ప్రజాశక్తి – వేటపాలెం
సామరస్య న్యాయం – మహిళా హక్కుల పరిరక్షణపై గెస్ట్ లెక్చర్ నిర్వహించినట్లు సెయింట్ ఆన్స్ కళాశాల అడ్మిని స్ట్రేటివ్ మేనేజర్ ఆర్‌వి రమణమూర్తి శుక్రవారం తెలిపారు. ఇంటర్నల్ కంప్లయంట్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్దునులు నేటి ఆధునిక సమాజంలో సమస్యలను, సవాళ్లను ఎదుర్కోటానికి, పురోభివృద్ధి కొరకు తగిన సూచనలు, సలహాలు అందజేస్తు అవగాహనా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. మండల న్యాయ సేవా అధికార సంస్థ సహకారంతో సదస్సు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ ఎం వేణుగోపాలరావు తెలిపారు. సదస్సులో సివిల్ జడ్జి ఎం సుధారాణి హాజరై విద్యార్ధులకు మహిళా హక్కులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ఇంటర్నల్ కంప్లయింట్ కమిటి కన్వినర్ ఆర్ఎన్‌డి ధనలక్ష్మి పాల్గొన్నారు.