ప్రజాశక్తి – భట్టిప్రోలు
యుటిఎఫ్ మండల నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా వి సురేష్ కుమార్, ఎం శ్రీనివాసరావుతోపాటు కార్యవర్గ సభ్యులను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించినట్లు యుటిఎఫ్ బాపట్ల జిల్లా కార్యదర్శి కెవి శ్రీనివాసరావు తెలిపారు. గౌరవ అధ్యక్షులుగా కె వేగేశ్వరరావు ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం కావాలన్నా, ప్రభుత్వ విద్య రంగాన్ని రక్షించుకోవాలన్నా ఉధ్యమాలు తప్ప మరో మార్గం లేదని అన్నారు.
రేపల్లెలో జరిగే స్వర్ణోత్సవాలు విజయవంతం చేయాలి
రేపల్లెలోని ఎంసీఏ హాలులో కామ్రేడ్ మహమ్మద్ గౌస్ ప్రాంగణంలో డిసెంబర్ 3న జరగనున్న యుటిఎఫ్ స్వర్ణోత్సవ ప్రారంభ వేడుకలు, బాపట్ల జిల్లా ద్వితీయ నూతన కౌన్సిల్ సమావేశం విజయవంతం చేయాలని యుటిఎఫ్ మండల నూతన కౌన్సిల్ అధ్యక్ష, కార్యదర్శులు వి సురేష్ ఎం శ్రీనివాసరావు కోరారు. స్వర్ణోత్సవ వేడుకలకు యుటీఎఫ్ రాష్ట్ర నాయకులు నక్క వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, యుటిఎఫ్ సీనియర్ నాయకులు గాదె సుబ్రహ్మణ్యేశ్వరరావు, కోనేరు సాయిప్రసాద్, నూతలపాటి కోటేశ్వరరావు పాల్గొంటారని తెలిపారు.
రేపల్లె : యూటిఎఫ్ మండల నూతన కమిటీ శుక్రవారం ఎన్నికైంది. స్థానిక యుటీఎఫ్ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి ఎంవివి సుబ్రమణ్యం ఎన్నికల పరిశీలకుడు రాష్ట్ర కౌన్సిలర్ కె వెంకయ్య ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. యుటిఎఫ్ మండల గౌరవ అధ్యక్షులుగా వైసిఎస్ కృపారావు, అధ్యక్షులుగా చాటగడ్డ రాజ భూషణం, ఉపాధ్యక్షులుగా ఎం సత్యనారాయణ, టి ఉదయభాను, ప్రధాన కార్యదర్శిగా వివి సుబ్బారావు, కోశాధికారిగా వి పున్నారావు, మండల కార్యదర్శులు, జిల్లా కౌన్సిలర్లు, మహిళా కమిటీ కన్వీనర్లను ఎంపిక చేశారు. నూతన కమిటీ సభ్యులచే ఎన్నికల పరిశీలకుడు కె వెంకయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల తమవంతు బాధ్యతగా పనిచేస్తామని నూతన కమిటీ ప్రకటించింది. కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు రవీంద్ర, ఫ్రాన్సిస్, రాధాకృష్ణమూర్తి, జి శ్రీనివాసరావు పాల్గొన్నారు.