ప్రజాశక్తి – రేపల్లె
మండలలోని పెనుమూడి పంచాయతీలో శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ ఆదేశాలతో బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను టిడిపి బూత్ కన్వీనర్ కొక్కిలిగడ్డ ధనుంజయరావు ఆధ్వర్యంలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధనుంజయ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. టీడీపీ అమలు చేయనున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వాటికి చంద్ర బాబు గ్యారెంటీ అని చాటాలని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అన్యాయాలు, అరాచకాలపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించాలని కోరారు. టిడిపి మినీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలైన మహాశక్తి, యువగళం, అన్నదాత, ఇంటి ఇంటికీ మంచి నీటి కుళాయి, పేదవారి ఆదాయాన్ని రెట్టింపు చేయడం వంటి కార్యక్రమాలను ప్రతి ఇంటింటికి వెళ్లి కరపత్రాల ద్వారా వివరిచనున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో టిడిపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు, ముప్పాల శ్రీనివాసరావు, నాగిడి నాగరాజు, నాగిడి ఆంజనేయులు, నాగిడి సుబ్రహ్మణ్యం, నాగిడి వెంకటేశ్వర్లు, మహిళా నాయకురాలు నాగిడి చెంచులక్ష్మి పాల్గొన్నారు.