విద్యార్థులకు కళ్ళజోళ్ళ పంపిణీ

Nov 24,2023 00:37

ప్రజాశక్తి – చెరుకుపల్లి
ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతమైందని మాజీ ఎంపీపీ చేన్ను కోటేశ్వరరావు అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా కంటి వెలుగు పథకం ద్వారా మండలంలోని గుండ్లపల్లి జెడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థులకు కళ్ళజోళ్లు గురువారం పంపిణీ చేశారు. 53మంది విద్యార్థులకు కళ్ళజోళ్లు అందజేశారు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మంచాల విజయ్ కిషోర్ బాబు మాట్లాడుతూ అవసరమైన ప్రతి విద్యార్థికి పరీక్షలు నిర్వహించి అవసరమైతే మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రత్యేక ఘనతను సాధించిందని అన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కవిత, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సోహెల్ అహ్మద్, ఎఎన్ఎం సరిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️