ప్రజాశక్తి – కర్లపాలెం
మానవసేవయే మాధవ సేవగా భావించి అభాగ్యులైన నిరుపేదలకు సేవ చేయటం సంతృప్తినిస్తుందని యునోయా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టి దొంతిరెడ్డి చంద్రకిరణ్ రెడ్డి అన్నారు. యునోయా ట్రస్ట్ ఆవిష్కరణ సందర్భంగా శ్రీరామ నగర్ గ్రామంలో వృద్దులు, వితంతు మహిళలు 50మందికి దుప్పట్లు గురువారం పంపిణీ చేశారు. తమ తాత నాగిరెడ్డి, నాయనమ్మ బిక్షావతి జ్ఞాపకార్థం తమ తండ్రి శ్రీనివాసరెడ్డి, తల్లి మృదులతో కలిసి చలి కాలంలో ఉపయోగపడే విధంగా దుప్పట్ల పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బోడ లాభంరాజు, ఆట్ల వెంకట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.