ప్రజాశక్తి – చీరాల
కుల వివక్ష పోయినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రమని, నేటికి కొన్ని వర్గాలకు స్వాతంత్ర్య ఫలాలు అందలేదని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని అన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని సౌత్య్రా గ్రామంలో దళిత యువకుడు కమలేష్ దాహం వేసి పబ్లిక్ కులయిలోని నీళ్లు త్రాగినందుకు కొట్టి చంపిన సురేష్ రాథోడ్, అతని అనుచరును చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చెరువులో నీళ్లు తాగినందుకే చంపేస్తుంటే అక్కడి ప్రభుత్వం ఏంచేస్తుందని ప్రశ్నించారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం అంద చేశారు. కార్యక్రమంలో షేక్ నజీర్, షేక్ అబ్దుల్ ఖాదర్, ఇబ్రహీం, వెంకటేశ్వర్లు, తులసి, మోజేష్, అల్తాఫ్ పాల్గొన్నారు.