ప్రజాశక్తి – బాపట్ల
మానవ జాతి పుట్టుక పరిణామంపై డార్విన్ సిద్ధాంతంపై జెవివి సాంస్కృతిక విభాగం రాష్ట్ర నాయకులు కోటా వెంకటేశ్వరరెడ్డి విద్యార్థులకు వివరించారు. జీవజాతుల పుట్టుక గ్రంధాన్ని ప్రచురించిన దినోత్సవ సందర్భంగా జెవివి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక విజయలక్ష్మి పురంలోని డాక్టర్ దోప్పలపూడి మల్లికార్జునరావు చార్లెస్ డార్విన్ గార్డెన్‌ను మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్‌కు
చెందిన బాల బాలికలు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కారుమంచి విజయకుమార్ మానవ పుట్టుక పరిణామ సిద్ధాంతంపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో దొప్పలపూడి రామ్మోహనరావు, హెచ్‌ఎం దుర్గాదేవి, ప్రగతి స్కూల్ చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
పొదిలి : భూమి మీద మానవుడు కాలక్రమంలో పరిణామం చెందాడని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కె సుబ్రహ్మణ్యం అన్నారు. జీవ పరిణామ దినోత్సవం సందర్భంగా జెవివి ఆధ్వర్యంలో కస్తూరిబా బాలికల పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చార్లెస్ డార్విన్ గ్రంథం అమలులోకి వచ్చిన నవంబర్ 24న ప్రతి ఏడాది జీవ పరిణామ దినోత్సవంగా జరుపుకుంటున్నారని అన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి సైన్స్ పట్ల, శాస్త్రీయ దృక్పథం పట్ల ఆసక్తి పెంచుకోవాలని చెప్పారు. విశ్వం ఎలా ఏర్పడింది, జీవం ఎలా ఆవిర్భవించింది, మనిషి భూమిపై ఎలా ఏర్పడ్డాడు, కాలక్రమంలో ఎలా అభివృద్ధి చెందుతున్నాడో తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సభకు జెవివి జిల్లా కార్యదర్శి దేవ ప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జెవివి మండల అధ్యక్షులు జూపల్లి వెంకటేశ్వర్లు, కేజీబీవీ ప్రిన్సిపల్ ఎం అనురాధ, ఉపాధ్యాయులు కసుమూరు, ఎలిజిబెత్ పాల్గొన్నారు.