పశుఆరోగ్య సంరక్షణపై అవగాహన

Nov 23,2023 00:33

ప్రజాశక్తి – నగరం
పశు ఆరోగ్య సంరక్షణ కార్డులను ప్రతి రైతుకు చేరే విధంగా సిబ్బంది కృషి చేయాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ ఎం హనుమంతరావు సూచించారు. పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో నగరం, చెరుకుపల్లి, అమర్తలూరు మండలాల పరిధిలోని పశు వైద్య సిబ్బందితో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పధకాలను ప్రతి పాడి రైతుకు తెలియజెప్పాలని అన్నారు. ఆరోగ్య సంరక్షణ కార్డులను అందజేసి వాటి ప్రాముఖ్యతను వివరించాలని కోరారు. పశువులకు బ్రూ సెల్లా టీకాలు వేయించాలని అన్నారు. రైతుకు ఇంటి వద్దనే అవసరమైన సహాయం చేయాలని సూచించారు. సమావేశంలో స్థానిక సహాయ సంచాలకులు డాక్టర్ ఎం నాగేశ్వరరావు, మండలాల పశు వైద్యులు వెంకటేశ్వరరావు, సారధి, గోపాలమిత్రలు పాల్గొన్నారు.

➡️